తాళ్లూరు ఎంపీడీఓగా సానికొమ్ము నత్యం గురువారం బాధ్యతలు చేపట్టారు. తాళ్లూరు ఇన్చార్జి ఎంపీడీఓ దార హనుమంత రావు సెలవులపై వెళ్లటంతో సానికొమ్ము సత్యంకు ఎంపీడీఓ ( ఎఫ్ ఏసీ ) బాధ్యతలు అప్పగించారు. గత టిడిపి ప్రభుత్వం కూడ సానికొమ్ము ఎఫ్ ఎసీ ఎంపీడీఓగా పనిచేసారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల నమన్వయతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళ్తానని ఎంపీడీఓ ఈ సందర్భంగా అన్నారు.
