ప్రభుత్వం తక్షణమే కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్కీం వర్కర్స్ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బోడపాటి హనుమంత రావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం బ్రిటీష్ కాలం నుండి పోరాడి తెచ్చుకున్న హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. అంగన్వాడీ వేతనాలు పెంచాలని, ఎఫ్ ఆర్ ఎన్ రద్దు చెయ్యాలని, సంక్షేమ పధకాలు అమలు చెయ్యాలని, గ్యాడ్యూటీ రూ.1.50 లక్షలు ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని నినదించారు.
నూతన కమిటీ ఎన్నిక …
మండల సీఐటీయూ కన్వినర్గా పూనారి రామారావు మరో 12 మందితో కమిటీ వేసారు. వారిలో వెంకట రమణ, నాగమణి, వాణి, పద్మావతి, విశ్వ వాణి, పుష్పలత, నుషన్న, సుహాషిణి, సాల్మన్, ఆర్ సునీతలు ఉన్నారు.
