బేగంపేట సెప్టెంబర్ 2 ( జేఎస్డిఎం న్యూస్)
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని బేగంపేట డివిజన్ పరిధిలో 8 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి పంపిణీ చేశారు బాలనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. బోయిన్పల్లి డివిజన్ కు చెందిన 47 మందికి ఫతేనగర్ డివిజన్ కు చెందిన 27 మందికి బేగంపేట్ డివిజన్ కు చెందిన ఎనిమిది మందికి మూసాపేట్ డివిజన్ కు చెందిన ఐదుగురికి ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తులం బంగారం హామీని ఎప్పుడూ నెరవేరుస్తారంటూ ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు,అధికారులు బిఆర్ఎస్ నాయకులు,లబ్ధిదారులు. పాల్గొన్నారు.

