ప్రకాశం జిల్లాకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) పెండింగ్ నిధులు రూ. 10 కోట్లు విడుదలయ్యాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… ప్రకాశం జిల్లాకు నరేగా పెండింగ్ నిధులు రూ. 10 కోట్లు విడుదలయ్యాయని, త్వరలో ఈ నిధులు పనులు చేసిన వారి ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం కేవలం కక్షతో నిధులివ్వకుండా పనులు చేసిన వారిని ఇబ్బందులకు గురి చేసిందన్నారు. తాము చెప్పిన మాట ప్రకారం పెండింగ్ నిధులు చెల్లిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలోనే ప్రకాశం జిల్లాలో రూ.170 కోట్లతో నరేగాలో అభివృద్ధి పనులు చేశామని,పంచాయతీ రాజ్ లో రూ.140 కోట్లతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించామన్నారు. ఈ సందర్భంగా నిధులు విడుదలకు చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి కృతజ్ఞతలు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
