జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మండలంలోని ఫెర్టిలైజర్స్ దుకాణాలను ఎస్పై మల్లిఖార్జున రావు తన సిబ్బందితో అకస్మిక తనిఖీ నిర్వహించారు. తాళ్లూరు, తూర్పుగంగవరంలలో ఎరువుల దుకాణంలో ఉన్న స్టాకు వివరాలు, బోర్డుపై నిల్వ రాసిన స్టాకును పరిశీలించారు. రైతులకు అందుబాటులో లేకుండా చేసి బ్లాక్ మార్కేట్లో అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించి వారికి మేలు చేసే విధంగా ప్రతి ఒక్క ఫెర్టిలైజర్స్ యజమాని వ్యవహరించాలని సూచించారు.
