తాళ్లూరు మండలంలో దివంగత సీఎం వైఎన్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు మంగళవారం ప్రతి పంచాయితీ పరిధిలో నిర్వహించారు. తాళ్లూరు మండల కేంద్రంలో వెల్లంపల్లి రోడ్లోని, బ్రహ్మాం గారి గుడి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు వైసీపీ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వైసీపి మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మాజీ సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్ల పాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎల్ జి వెంకటేశ్వర రెడ్డి, నర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్ర సేనా రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు పులి ప్రసాద్ రెడ్డి, కుమ్మిత జయరామి రెడ్డి, నర్పంచి కోట శివలక్ష్మి వెంకట రామి రెడ్డి, కోట క్రిష్ణా రెడ్డి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాన్, నంగు కొండా రెడ్డి, గుంటి గంగ దేవస్థానం మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాస రావు, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం తదితరులు పాల్గొన్నారు.

