సెప్టెంబర్ 3న మహాగణపతి, లక్ష్మీ గణపతి హోమాలు – భక్తులకు అన్నసంతర్పణ

ఒంగోలు నగరం, సీతారామపురంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు సెప్టెంబర్ 3 బుధవారం మహా అన్నదాన సంతర్పణ జరుగుతుందని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీ ఒక ప్రకటనలో తెలియజేశారు.
వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు అంగరంగ వైభవంగా స్వామివారు పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం కార్యక్రమాలలో భాగంగా ఉదయం 8 గంటలకు వేద పండితులు సుబ్రహ్మణ్య శర్మ, వారి శిష్య బృందంచే 32 గణపతుల మహాగణపతి, లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలియచేశారు. గత 32 సంవత్సరాల నుండి నిర్విరామంగా మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని, ఆ ప్రకారం గణపతికి ఈ సంవత్సరం 32 కేజీల లడ్డును ప్రసాదం గా సమర్పించడం జరిగినదని కమిటీ వారు తెలియజేశారు.
కావున సీతారామపురం, పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారి కృపా కటాక్షాలు పొంది, స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *