తాళ్లూరు : మండలం లోని బెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ పోశం నారాయణరెడ్డి జ్ఞాపకార్థం మండలంలో జరిగే శుభకార్యాలకు ఉచితంగా మంచినీరు అందించేందుకు ఆయన కుమారులు ట్యాంకర్‌ను ఏర్పాటు చేసారు . అమెరికాలో నివసిస్తున్న పోశం వెంకటరమణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్ రెడ్డి లు ఈ ట్యాంకర్‌ను సమకూర్చారు. మండలంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించే కుటుంబాలకు మంచినీటి సరఫరా కోసం ఈ ట్యాంకర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
శుభకార్యాల సమయంలో అతిథులకు సరిపడా మంచినీటిని సమకూర్చుకోవడంలో ఈ ఉచిత సేవ నిర్వాహకులకు తోడ్పడనుంది. సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించిన తండ్రికి, మండల ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమం చేయటం ద్వారా ఆయన కుమారులు నివాళులు అర్పించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: