బేగంపేట నవంబర్ 8,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
ప్రజల భద్రత, భవిష్యత్ లో ఎలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు బస్తీ మొత్తం సి సి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెంగళ రావు నగర్ లో ఎమ్మెల్యే తలసాని
సి సి కెమెరాలు ప్రారంభించారు.ఇటీవల వెంగళ రావు నగర్ లో వరుస దొంగతనాలు జరిగాయి.దొంగతనాల నివారణకు సి సి కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయన్నారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూత్వరలోనే నేరస్తులను పట్టుకొనిబాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని వెంగళ్ రావు నగర్ లో ఇటీవల వరుస దొంగతనాలు జరిగి పెద్ద మొత్తంలో సొత్తు చోరీ అయింది. దీంతో బాధితులు, బస్తీ వాసులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పరిస్థితి ని వివరించారు. స్పందించిన ఆయన పోలీసు శాఖ అధికారులతో కలిసి బస్తీలో పర్యటించారు.
బస్తీ ప్రజల భద్రత, భవిష్యత్ లో ఎలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు బస్తీ మొత్తం CC కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన 28 CC కెమెరాలను బస్తీలోని కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ ప్రజలు ఇకపై ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. బస్తీలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారని అన్నారు. బస్తీలో ప్రజల అవసరాలకు తగినట్లుగా చేయాల్సిన అభివృద్ధి పనులు ఇంకా ఉన్నాయని, వాటిని త్వరలో చేపడతామని ప్రకటించారు. బస్తీలో ఇకపై ఎలాంటి దొంగతనాలకు, అపరిచిత వ్యక్తుల రాకపోకలను CC కెమెరాల ఏర్పాటు తోనియంత్రించవచ్చని అన్నారు. CC కెమెరాలను బస్తీ వాసులు సక్రమంగా నిర్వహించుకోవాలని అన్నారు. తమకు అన్నివేళలా అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బస్తీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, గణేష్, బస్తీ వాసులు రాజు, సాయినాథ్, ఝాన్సీ, రాంచందర్, పద్మ, అభిషేక్, అడ్డు తదితరులు పాల్గొన్నారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: