సంతమాగులూరు మండలం, తంగేడుమల్లి ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ – 1,146 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మాలెంపాటి శ్రీనివాసరావు ఘన విజయం

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం తంగేడుమల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీ బలపరిచిన అభ్యర్థి మాలెంపాటి శ్రీనివాసరావు తన సమీప ప్రత్యర్థిపై 1,146 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన ఎన్నికల అధికారుల చేతుల మీదుగా అధికారిక డిక్లరేషన్ ఫారాన్ని అందుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ అఖండ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. మాలెంపాటి శ్రీనివాసరావుకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నూతన ఎంపీటీసీ మాలెంపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ… తనపై విశ్వాసముంచి ఇంతటి చారిత్రాత్మక విజయాన్ని అందించిన తంగేడుమల్లి ప్రజలకు, ఓటర్లకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి నాయకత్వం, ఆయన వెన్నుదన్నుగా నిలవడమే ఈ భారీ విజయానికి ముఖ్య కారణమని కొనియాడారు. మంత్రివర్యుల మార్గదర్శకత్వంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు శ్రమించి, తమకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, మండల నాయకులు, యువకులు మరియు కార్యకర్తలకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మాలెంపాటి గోపి, శివరామకృష్ణ, సీనియర్ నాయకులు కొత్తపల్లి హనుమంతరావు, మాలెంపాటి హనుమంతరావుతో పాటు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *