గొప్పమానవతావాది, విద్యావేత్త, సమాజ సంస్కర్త పద్మారావు ముదలియార్…. ఎమ్మెల్యే తలసాని..

బేగంపేట నవంబర్ 7(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
గొప్పమానవతావాది, విద్యావేత్త, సమాజ సంస్కర్త పద్మారావు ముదలియార్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దివాన్ బహదూర్ పద్మారావు ముదలియార్ 151 వ జయంతి సందర్భంగా శనివారం పద్మారావు నగర్ పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పద్మారావు ముదలియార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి సమాజానికి చేసిన సేవా కార్యక్రమాలతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని, అందుకు పద్మారావు ముదలియార్ నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నిజాం కాలంలో సమాజ సేవ, విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన నిరూపమాన సేవలకు గుర్తింపు గానే పద్మారావు నగర్ పేరు ఈ ప్రాంతానికి వచ్చిందని వివరించారు. పద్మారావు పార్క్ స్థలం 2 ఎకరాలు పద్మారావు ముదలియార్ విరాళంగా అందజేసిందేనని చెప్పారు. ప్రభుత్వ ఆదయ్య స్మారక పాఠశాల, కీస్ బాలికల పాఠశాలలు కూడా ఆయన కృషితో నే ఏర్పాటైందని తెలిపారు. చరిత్ర ఉన్నంత వరకు పద్మారావు ముదలియార్ చేసిన సేవలు ఉంటాయని అన్నారు. పద్మారావు ముదలియార్ సమాజానికి చేసిన సేవలు, విద్యా వ్యాప్తికి ఆయన కృషి, పద్మారావు నగర్ చరిత్ర నేటి తరం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు పద్మారావు ముదలియార్ చరిత్రను పుస్తక రూపంలో ప్రజలకు అందజేయాలని పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కోరారు. దేశ విదేశాలలో మన సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ, పండుగలను గొప్పగా జరుపుకుంటుంటే నేటితరం పిల్లలకు మన సాంప్రదాయాలు, పండుగల విశిష్టత తెలియకపోవడం బాధాకరం అన్నారు. అనంతరం పద్మారావు ముదలియార్ వారసులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సన్మానించారు. కార్యక్రమంలో పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, చంద్రశేఖర్, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, పద్మారావు నగర్ వాసులు చక్రధర్ యాదవ్, జగ్గయ్య, పద్మారావు ముదలియార్ మనువళ్లు నరేష్, శేఖర్, అభినవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *