ప్రమాదాలకు దూరంగా.. ఆనందాలకు చేరువగా దీపావళి పండుగను జరుపుకోవాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు -ప్రకాశం జిల్లా ప్రజలకు మరియు పోలీసు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ

చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపడంతో పాటు శాంతి, సంతోషం, సౌభాగ్యం, అభివృద్ధిని తీసుకురావాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆకాంక్షించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ సురక్షితంగా ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పలు సూచనలు తెలియజేశారు. ప్రజలు నాణ్యమైన, కాలుష్యరహిత బాణాసంచాను వినియోగిస్తూ దీపావళి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, కాటన్ దుస్తులు ధరించాలని, నీరు, ఇసుక వంటి అగ్నిమాపక సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పాత, సగం కాలిన టపాసులను తిరిగి వెలిగించరాదని, ఆసుపత్రుల సమీపంలో, గ్యాస్ సిలిండర్లు, ఇంధన నిల్వల వద్ద బాణాసంచా కాల్చరాదని హెచ్చరించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు తావులేకుండా దీపావళి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

జిల్లాలో బాణసంచా తయారీ, విక్రయ దుకాణాలు తప్పక లైసెన్సు కల్గి ఉండి ప్రభుత్వ నిబంధలనకు లోబడి బాణసంచా అమ్మాలని, షాపుల వద్ద అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని, లైసెన్సులు లేకుండా ఎవరైనా టపాసులు తయారుచేసిన, నిల్వ చేసినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు.

దీపావళి రోజున ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అత్యవసర సమయంలో ఫైర్ స్టేషన్ కు 101, పోలీస్ డయల్ 100/112 లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ కు తెలియ చెయ్యాలని సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *