ప్రజల సమస్యలను పరిష్కరించ కుంటే ప్రజలతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాం…. ఎమ్మెల్యే తలసాని హెచ్చరిక.

బేగంపేట నవంబర్ 7,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
ప్రజల సమస్యలను పరిష్కరించ కుంటే ప్రజలతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని, అన్నగారు ఎమ్మెల్యే తలసాని హెచ్చరించారు.
ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని, తలసాని యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని నల్లగుట్ట జే లైన్, ఎఫ్ లైన్, కరీం కాంపౌండ్, చుట్టాల బస్తీ, మెక్లాడ్ గూడ, మమతా స్వీట్ హౌస్ తదితర ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించడం, కలుషిత త్రాగునీరు సరఫరాఅవుతుండటంతో శుక్రవారం స్థానికులు ఎమ్మెల్యే ను కలిసి సమస్యను విన్నవించారు. స్పందించిన ఆయన శనివారం అధికారులతో కలిసి నల్లగుట్ట ప్రాంతంలో పర్యటించి నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పలువురు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తాగునీరు కలుషితమవుతున్నాయని, అవి తాగి అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య కు గల కారణాల గురించి వాటర్ వర్క్స్ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఓపెన్ నాలాలోని
కే ఎం డ్రైనేజీ లైన్ డ్యామేజ్ కావడం వల్ల నాలాలోని మురుగునీరు పైప్ లైన్ ద్వారా బయటకు వస్తుందని వివరించారు. వెంటనే డ్యామేజ్ అయిన పైప్ లైన్ పనులకు అవసరమైన మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాలాలో నెలల తరబడి పూడిక, వ్యర్ధాలు తొలగించని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నాలాలో పేరుకుపోయిన వ్యర్ధాలను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, కావాడిగూడా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పుష్పలత లకు ఫోన్ చేసి సమస్య తీవ్రతను వివరించారు. ప్రజలు రోగాల బారిన పడుతుంటే సమస్య పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే నాలాలో పేరుకుపోయిన వ్యర్ధాలు, పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మురుగునీరు త్రాగుతూ అపరిశుభ్ర వాతావరణం తో ప్రజలు దుర్భర జీవితాన్ని గడుపుతుంటే వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. పూడిక తొలగించని కారణంగా మురుగునీటి ప్రవాహం సక్రమంగా లేక దుర్వాసన, దోమలతో నాలా పరిసరాలలో ని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాలాలలో పూడిక తొలగింపు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందని విమర్శించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పూర్తిగా వ్యర్ధాలతో నిండిపోయిన నాలాను ఎందుకు శుభ్రం చేయలేదని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ ఏ నాడు సమస్యలపై సమీక్షలు నిర్వహించ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరోజు ఈ ప్రాంతంలో గడిపితే ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ప్రజలతో కలిసి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట వాటర్ వర్క్స్ సీజీఎం వినోద్, జిఎం శ్రీధర్ రెడ్డి, డీజీఎం వెంకట్ రెడ్డి, ఎలెక్ట్రికల్ ఏఈ శివ రామకృష్ణ, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, సతీష్, సంజయ్, కొండాపురం మహేష్ యాదవ్, వివిధ బస్తీలకు చెందిన నర్సింగరావు, జగ్గూ, ప్రశాంత్ సింగ్, రాజేష్, సత్యనారాయణ, లతీఫ్, హరినాధ్, గపూర్, శంకర్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *