విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసిన మంత్రి గొట్టిపాటి

సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నిడమానూరు, నాగులుప్పలపాడు, వినోదరాయునిపాలెం ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు చేపట్టిన పనులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సిబ్బందితో పాటు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చి సేవలందిస్తున్న సిబ్బందిని మంత్రి కలుసుకుని మాట్లాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా సిబ్బందికి కల్పిస్తున్న ఆహారం, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. తుఫాన్ పరిస్థితుల్లో సొంత ప్రాంతాలను వదిలి వచ్చి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో సేవలందిస్తున్న సిబ్బంది అంకితభావాన్ని మంత్రి అభినందించారు. ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *