బేగంపేట నవంబర్ 7 (జేఎస్ డిఎం న్యూస్ ) :
రసూల్‌పురా చౌరస్తా లో రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన ఓ టిప్పర్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌కు చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాల్ శ్యామ్‌లాల్ భార్య కవిత, కుమార్తె సోనాక్షితో కలిసి రసూల్ పుర జంక్షన్ ఆర్య హోటల్ సమీపంలో రోడ్డు దాటుతుండగా
ఈ ఘటన చోటుచేసుకుంది. పరేడ్ గ్రౌండ్స్ వైపు నుంచి అమీర్‌పేట్ వైపు అతివేగంగా, అజాగ్రత్తగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ (నంబర్: TS 12 UD 7666) ఆమెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టిప్పర్ చక్రం కవిత ఎడమ కాలిపై నుంచి వెళ్లడంతో కాలు ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అంబులెన్స్ డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. బాధితురాలి భర్త లాల్ శ్యామ్‌లాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట ఎస్సై సిహెచ్. శ్రవణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: