రాంగోపాల్ పేట నవంబర్ 8,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగ చిన్నారులకు నిత్యావసర
సరుకుల పంపిణీ చేసారు.ఈ సందర్భంగా త్రికాల మనోజ్ కుమార్ మాట్లాడుతూ సీ ఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఎంతోసంతోషకరమని, సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం, పేదలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ప్రజాసేవే లక్ష్యంగా, పేదలు మరియు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌పేట్ డివిజన్‌కు చెందిన అన్ని బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) పాల్గొని దివ్యాంగ చిన్నారులకు నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: