సికింద్రాబాద్ నవంబర్ 8,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
సికింద్రాబాద్ లో డ్రగ్ మార్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం బండిమెట్ పరిధి మారుతివీధిలో ఉన్న ‘శ్రీ సాయి బాలాజీడిస్ట్రిబ్యూటర్ డ్రగ్ మార్ట్’లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సికింద్రాబాద్, గాంధీ ఆస్పత్రి అగ్నిమాపక కేంద్రాల నుంచి వచ్చిన ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ సహాయక చర్యలను సికింద్రాబాద్ డీఎఫ్వో, ఏడీఎఫ్వో, ఎస్ఎఫ్వోలు స్వయంగా పర్యవేక్షించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని,
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టం వివరాలను అంచనా వేస్తున్నామని, మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా సకాలంలో అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: