రాష్ట్రంలో పచ్చదనాన్ని , పారిశుధ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రజలను భాగస్వాముతో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ -రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి

గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రతగా పచ్చదనంతో విరాజిల్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత పది నెలల నుండి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుచున్నదని, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శనివారం ఉదయం కొండపి నియోజకవర్గం, టంగుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీకాలనీ లో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొని రహదారి వెంబడి మరియు గృహాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు పండ్ల మొక్కలను ఇవ్వడంతో పాటు రహదారుల వెంబడి, ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుచున్నదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించుకోవడంతో పాటు పారిశుధ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రజలను భాగస్వాములను చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు
మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం వలన రాష్ట్ర ఆనందదాయకంగా, ఆరోగ్యదాయకంగా ఉంటుందన్నారు. ప్రతి ఇంటిలో వేరు చేసిన తడి చెత్త, పొడి చెత్తను పంచాయతీ సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డులకు తరలించి సంపద సృస్టించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి మాచర్ల నియోజక వర్గంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గోనుచున్నారన్నారు. ప్రజలందరు ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తూ, క్లాత్ బ్యాగులను వాడాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేసారు. రాష్ట్రంలో ప్రతి పల్లె స్వచ్చ పల్లెగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశయమని, ఆ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ప్రభుతం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్దే లక్ష్యంతో పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు. మురుగు కాలువల ఏర్పాటు, స్మశానం ఏర్పాటు, ఇళ్ళ పట్టాల మంజూరు మరియు జాతీయ రహదారి కనెక్టివిటి గురించి ఈ కాలనీ వాసులు ప్రస్తావించడం జరిగిందని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా కాలనీ వాసులకు తెలపడం జరిగింది.

జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ… స్వచ్చతా హి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి రెండు మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుచున్నదన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్ మాసం నుండి ప్రతి నెలా మూడవ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తో కలసి టంగుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీ కి రావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ వలన చాలా చాలా అనర్ధాలు ఉన్నాయని, వాటిని తగ్గించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాని నుంచి సంపద ఎలా సృష్టించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సర్క్యులర్ ఎకానమీ అనే పాలసీని ప్రవేశ పెట్టారన్నారు. వీటిపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుచున్నదన్నారు. ప్రతి కుటుంబం తన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో భాగస్వాములై నా ఇల్లు, నా వార్డు, నా గ్రామం, నా మండలం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం పరిశుభ్రంగా, పచ్చదనం గా ఉండాలి అనే లక్ష్యంతో కృషి చేసి భావితరాలకు మంచి సమాజాన్ని అందించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. బాపూజీ కాలనీ ప్రజలు కొన్ని సమస్యలను తెల్పడం జరిగిందని, ఈ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అయితే కాలనీ వాసులు కచ్చితం తమ పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనం పెంపొందేలా ప్రతి కుటుంబం భాద్యతతో పనిచేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఈ సందర్భంగా కాలనీ వాసులకు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా క్లాప్ మిత్రులతో కలసి మంత్రి, జిల్లా కలెక్టర్, అధికారులు ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, డిడి సోషల్ వెల్ఫేర్ లక్ష్మా నాయక్, ఎస్సి కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్, సర్పంచ్ మమత, మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *