ఆరోగ్యం పట్ల మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక అన్నారు. నాగంబొట్ల పాలెంలో బుధవారం స్వస్థ నారీ నస్త పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్పంచి చిమటా సుబ్బా రావు, బీసీ సంఘ నాయకుడు పిన్నిక రమేష్లు శిబిరాన్ని ప్రారంభించారు. కౌమార బాలికలకు, గర్భవతులకు, బాలింతలకు 158 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేసారు. హెచ్ఐఓ చంధ్ర శేఖర్ బాబు, పీహెచ్ఎన్ రమణమ్మ, హెచ్పీ సుశీల, ఎం ఎల్ హెచ్పీలు ఆశలు పాల్గొన్నారు.

