సమాచారశాఖలో 38 ఏళ్ల 6 నెలలకుపైగా విధులు నిర్వహించి ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేస్తున్న ఏ.సుబ్బమ్మను సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు బుధవారం సన్మానించారు. టైపిస్టుగా, సీనియర్ అసిస్టెంట్ గా నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సుబ్బమ్మ సేవలు అందించారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని జిల్లా కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాలను ఉద్యోగులు, సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా రీజినల్ జాయింట్ డైరెక్టర్ టి.కస్తూరిబాయి పాల్గొన్నారు. క్రమశిక్షణ, నిబద్దతతో సుబ్బమ్మ పనిచేశారని ఆమె కొనియాడారు. డి.పి.ఆర్.ఓ. రమేష్, డివిజనల్ పి.ఆర్.ఓ. దుర్గాప్రసాద్, డీ.ఐ.పీ.ఆర్.ఓ, ఆర్.జే.డీ, ఆర్.ఐ.ఈ. కార్యాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

