తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లక్కవరం గ్రామంలో గురువారం స్వస్త నారీ సస్త పరివార్ కార్యక్రమాన్ని వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ అధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు, కోటేష్, బి హనుమా రెడ్డి, ఎఎంసీ డైరెక్టర్ నాగేంద్ర, టీవీ సుబ్బా రెడ్డి, ఎస్ శ్రీనులు ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. మహిళలు క్యాన్సర్, గర్భకోశ వ్యాధులు ఇతర ఆరోగ్య సమస్యలను వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ వివరించారు. 166 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. హెచ్ ఈఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ఎన్ ఎంవీ రమణమ్మ, హెచ్ వీ సుశీల, ఎంఎల్ హెచ్పీలు పాల్గొన్నారు.
