కోడికొండ – కడప – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పనులను నిర్దేశించిన సమయంలో త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని -జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అధికారులను, కాంట్రాక్ట్ ప్రతినిధులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలిసి గురువారం తాళ్లూరు మండల
కేంద్రం వద్ద జరుగుచున్న బికెవి ఎక్స్ ప్రెస్ హైవే పనులను పరిశీలించి అధికారులు, సంబంధిత నిర్మాణ ప్రతినిధుల నుండి వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ తాళ్ళూరు తహసిల్దార్ కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులు, బికెవి నిర్మాణ కాంట్రాక్ట్ ప్రతినిధులతో సమావేశమై ప్యాకేజీ వారిగా పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణ పనులు ప్రకాశం జిల్లా పరిధిలో మొత్తం 5 ప్యాకేజీ ల్లో 110 కిలో మీటర్ల మేర పనులు జరుగుచున్నవని, 2026 మే నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తి చేయాల్సి ఉందని, ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ పూర్తి కావడం జరిగిందని నేషనల్ హై వే పిడి అనిల్ కుమార్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. లేబర్ నమన్య ఉందని చెప్పారు. ప్రభుత్వాలు మారిన తర్వాత ఎన్విరాన్ మెంటల్ కమిటీ మారిందని, ఇంకా కమిటీ మెంబర్ల ఎన్నికోలేదని దీంతో కొంత నమస్య ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఈ నందర్భంగా రాజు బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రోజు వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని నిర్ణీత సమయంలో ఎక్స్ ప్రెస్ హైవే పనులను పూర్తి చేయాలన్నారు. నిర్మాణానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏమైనా నమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, నిర్మాణ కాంట్రాక్ట్ ప్రతినిధులకు సూచించారు. ప్రతి రోజు ఎంత పని చేస్తున్న పురోగతిపై ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో తనతో పాటు అధికారులను కలిసి అందులో వివరాలు నమోదు చెయ్యాలని కోరారు. ముందుగా కలెక్టర్ ను తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైన్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, నర్పంచి మేకల చార్లీన్ సర్జన్ లు
కలిసి ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ వెంట నేషనల్ హైవే పిడి అనిల్ కుమార్, ఇంచార్జి ఆర్టీఓ కళావతి, తహనీల్దార్ బివి రమణా రావు వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఎపీఎం దేవరాజ్, హౌసింగ్ ఎఈ హనుమంత రావు, రెవెన్యూ, రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


