దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు
గురువారం కలెక్టర్ రాజ బాబును తాళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో కలిసి నూతనంగా బాధ్యతలు స్వీకరించినందుకు తమ అభినందనలు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటులో స్థానిక రోడ్స్ దెబ్బతిన్నాయని, ఎన్ ఎస్ పి చిన్న కాలువలు పూడి పోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని పలు ఇబ్బందులు తెలిపారు. దర్శిలో వాటర్ స్కీమ్ ఫిల్టర్ బెడ్స్, తూర్పువీరాయపాలెం వద్ద ఉల్లగల్లు వైపు వేళ్ళు బ్రిడ్జి సమస్యలను సీఎం పర్యపర్యటనలో పూర్తి చెయ్యాలని ఆదేశించిన పనుల విషయమై తెలిపారు. దీంతో ఆయా పనులను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇతర పెండింగ్ సమన్యలను తెలిపారు. ఆయా పనులతో పాటు హైవే వలన రైతులు ఎదుర్కోంటున్న ఆయా సమస్యలను వ్రాత పూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ కోరారు. అనంతరం జెనీ గోపాల క్రిష్ణను కూడ సన్మానించారు. వారితో పాటు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, రామయ్య, నీటి సంఘం ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, నవూలూరి విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు.


