బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న దుకాణ దారులు ఎలాంటి ప్రమాదాల జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తహశీల్దార్ లక్ష్మీ నారాయణ తెలిపారు.
దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన దీపావళి దుకాణా లను తహసిల్దార్ ఎల్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఎం శ్రీదేవి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి మందుల దుకాణాదారులు తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండి దీపావళి మందులను విక్రయించుకోవాలని తెలియజేశారు. మందుల దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాటర్ క్యాన్లు, గ్యాస్ పంప్స్ ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఆర్ శ్రీకాంత్, విఆర్ఓ సిహెచ్ బ్రహ్మ తేజ. తదితరులు పాల్గొన్నారు.
