మొంథా తుఫాన్ పై జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమైనానరు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగా తుఫాన్ పై వినృత ప్రచారం కల్పించారు. మండల ప్రత్యేక అధికారి కుమార్, తహసీల్దార్ రమణా రావు, ఎంపీడీఓ అజిత, ఎస్పై మల్లిఖార్జున రావు, మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ -2 నుధాకర రావులు, విద్యుత్, ఆర్ డబ్ల్యు ఎన్, హౌసింగ్ ఎఈ లు రామక్రిష్ణ, వాలి, హనుంతరావు, ఎపీఓ వెంకట రావు, ఎపీఎం దేవరాజ్, డిప్యూటీ ఎంపీడీఓ నాగమల్లేశ్వరి, గ్రామ కార్యదర్శులు, విఆర్డీఓలు నచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని తుఫాన్ పై ర్యాలీ నిర్వహించి, వెల్లంపల్లి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి నమర్థవంతంగా, అవగాహనతో తుఫాను ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు. వాతావరణ శాఖ సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ రైతులు అవగాహనతో ముందుకు సాగాలని కోరారు. చెట్ల క్రింద ఉండవద్దని, ఉరుములు మెరుపులు, నీటి ప్రవాహాల పట్ల విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. అన్ని విభాగాల క్షేత్రస్థాయి సిబ్బంది తమకు అందుతున్న సమాచారాన్ని విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని కోరారు. దోర్నపు వాగు ప్రవాహం అధికంగా ఉండే ప్రధాన రహదారి తాళ్లూరు- విఠలాపురం మధ్య బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి పై ఉన్న లెవల్ స్తంబాలకు మోకులు, నపోర్టు తీగల ఏర్పాటు విషయమై పరిశీలించారు. ఆయా పాఠశాలకు సెలవులు ఇచ్చిన నేపధ్యంలో పాఠశాలలను ఎంఈఓ లు నుబ్బయ్య, నుధాకర్ రావులు పరిశీలించారు. అవసరమైన సమయంలో అందు బాటులో వాహనాలు ఉండే నిమిత్తం పాఠశాల బన్సులను అధికారులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. నిత్యం ఉన్నతాధికారులు నుండి వస్తున్న ఆదేశాలను పాటిస్తూ వీడియో కాన్ఫిరెన్స్లోపాల్గొన్నారు.





గుడిసే వాసులను రక్షిత ప్రాంతాలకు తరలింపు
శివరామపురం పరధిలో మొగలి గుండాల చెరువు పై బాగంలో నివాసం ఉంటున్న గుడిసే వాసులను మండల ప్రత్యేక అధికారి కుమార్, తహసీల్దార్ రమణా రావులు పరామర్శించారు. మధ్యాహ్నం నుండి వర్షం మొదలు కావటంతో, జిల్లా కలెక్టర్ రాజా బాబు ఆదేశాల మేరకు పాఠశాల బస్సులలో | సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 40 కుటుంబాలకు చెందిన వారిని గుంటి గంగా భవాని వద్ద ఉన్న రెడ్ల సత్రానికి తరలించారు. వారికి కావలసిన ఏర్పాట్లను వసతి, బోజనం వసతి కల్పించారు. తుఫాన్ తీరం దాటి పోయ్యే వరకు ఇక్కడే ఉండాలని, తప్పనిసరి పరిస్థితులతో తప్ప బయటకు రావద్దని కోరారు.

