ఒంగోలు నగరంలోని వ్యవసాయ కమిటీ ప్రాంగణం నందు ప్రకాశం జిల్లా లోని ఏ ఎం సి చైర్మన్ లు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు . ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనపుడు మీరందరూ కష్టపడ్డారు అన్ని మిమ్మల్ని గుర్తించి మీ అందరకీ ఈరోజు ఏ ఎం సి చైర్మన్లు గా ఏన్నుకోవడం జరిగినది. కాబట్టి మీ ప్రాంతంలోని రైతులకు ఉపయోగపడేలా మీరందరూ కస్టపడి మంచిపేరు తీసుకురావాలి కోరడం జరిగినది. ఈ కార్యక్రమం లో మేయర్ సుజాత , ఏ ఎం సి చైర్మన్లు మరియు తదితరులు పాల్గొన్నడం జరిగినది.

