విశ్వబ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం 31వ కార్తీక వన సమారాధన మహోత్సవంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు .
ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డు లోని కాఫీ బార్ వెనకాల విశ్వబ్రాహ్మణ కళ్యాణమండపంలో ఆదివారం జరిగిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం 31వ కార్తీక వన సమారాధన మహోత్సవంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ…. ఆ రోజుల్లో కళ్యాణ మండపానికి ఇచ్చిన స్థలం 50 లక్షలు అయిందని ఇప్పుడు అది కోట్ల రూపాయల పలుకుతుందని అన్నారు. కళ్యాణం మండపానికి రావటానికి సిమెంట్ రోడ్డు వేపిస్తామని అలాగే మండపానికి కిటికీలు మౌలిక సదుపాయాలు చేపిస్తామని తెలిపారు. విశ్వబ్రాహ్మణల అందరూ కలిసిమెలిసి ఉండాలని అందరూ ఒక త్రాటిపై కి రావాలని కలిసి ఉంటేనే ఏ పనైనా త్వరగా చేసుకోవచ్చు అని తెలిపారు. విశ్వబ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి లిస్ట్ తయారు చేసీ ఇవ్వండి అందరకు రెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అందరికీ వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారు . దానితోపాటు మీకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకురావాలని , మేము దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. విశ్వబ్రాహ్మణులు అంటే మాకు మొదటి నుంచి గౌరవం ఎప్పుడు పిలిచినా మేము అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే జనార్దన్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ , ఏసిపి క్రైమ్ బ్రాంచ్ కిరణ్ కుమార్ , ఏఎంసీ చైర్మన్ రాచ గండ్ల వెంకట్రావు స్వర్ణలత, నగర అధ్యక్షులు బండారు మదన్ , 33 వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి ,37వ డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు రావూరి లక్ష్మయ్య , వర్కింగ్ ప్రెసిడెంట్ సానల విశ్వరూప చారి , ప్రధాన కార్యదర్శి నూతక్కి మల్లేశ్వరరావు , కోశాధికారి రంగు రంగనాయకులు , ఆర్గనైజింగ్ సెక్రటరీ యద్దనపూడి శివప్రసాద్ , కందుకూరి పూర్ణచంద్రరావు మరియు కార్యవర్గ సభ్యులు మరియు విశ్వబ్రాహ్మణ సంఘబాద్యులు , రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.

