ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలోని ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం -ప్రకాశం జిల్లా ఎస్పీ  వి.హర్షవర్ధన్ రాజు

  • ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 117 ఫిర్యాదులు

ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కారించుటకు కొరకు  సోమవారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (మీ కోసం) కార్యక్రమంను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ  నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల యొక్క వ్రాతపూర్వక వినతులను ఎస్పీ  స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను  అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అందిన ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారుల వివరాలు తెలియజేసి, తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా  నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఎస్పీ   ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా సివిల్/భూ/ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేదింపులు,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు, చీటింగ్ మొదలగు ఫిర్యాదులు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….

* పుల్లల చెరువు మండలానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటిని తనఖా పెట్టి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుండి రూ.2,30,000/- రుణం తీసుకుని, ప్రతి నెలా రూ.7,228/- చొప్పున ఈఎంఐలను గత రెండు సంవత్సరాలుగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ, ఆ ఫైనాన్స్ కంపెనీ వారు చెల్లింపులకు సంబంధించిన ఎటువంటి రసీదులు ఇవ్వలేదని, ఇంకా బాకీ ఉందని బెదిరిస్తున్నారని పుల్లలు చెరువు మండలానికి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.

* కొత్తపట్నం మండలానికి చెందిన ఒక వ్యక్తి తన అవసరాల నిమిత్తం ఒకరి వద్ద నుండి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు తీసుకుని, వాటి తాలూకు ఇంటి డాక్యుమెంట్లు ఇచ్చినట్లు తెలిపారు. డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పిన ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వటం లేదని మరియు అదనంగా మరో ఒక 10 లక్షలు కట్టాలని ఫిర్యాది.

* చీటి పాట పేరుతో తన వద్ద నుండి మార్కాపురమునకు చెందిన ఒక వ్యక్తి ఐదు లక్ష రూపాయల గల ఒక చీటి కట్టించుకొని, అవసరాల నిమిత్తం చీటి పాడుకోవటం జరిగిందని, డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని, మార్కాపురం టౌన్ కు చెందిన వ్యక్తి పిర్యాదు.

ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు వన్ టౌన్ , దర్శి , మార్కాపురం , కొండేపి సీఐ లు వై.నాగరాజు,  వై.రామారావు, పి.సుబ్బారావు ,  జి.సోమశేఖర్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *