జిల్లాలో పలు చోట్ల నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైంజ్ అధికారి షేక్ అయోషా బేగం తెలిపారు. పొదిలి, దర్శి, కనిగిరి, కంభం ఎక్సైజ్ స్టేషన్ ల పరధిలోని పొదిలి రూరల్ మండలం, దర్శి రూరల్ మండలం, కనిగిరి రూరల్ మండలం, బేస్తవారి పేట మండలం లలో నూతన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడునని చెప్పారు. ఈనెల 12న ఒంగోలు పీజీ ఆర్ ఎస్ హాల్లో డ్రా తీసి దుకాణాలు కేటాయించబడునని చెప్పారు. దరఖాస్తు దారుడు 21 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పారు. ప్రతి దరఖాస్తు దారుడు ప్రతి ఒక్క దరఖాస్తుకు రూ. 2లక్షలు ఫీజులు చెల్లించాలని, ఈ ఫీజు రీ ఫండబుల్ అని చెప్పారు. పొదిలి, దర్శి, మార్కాపురం, కనిగిరి, యర్రగొండ పాలెం, గిద్దలూరు, కంభం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలో పలు రూరల్ మండలాలలో నూతన బ్రాందీ షాపులకు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం
03
Nov