తాళ్లూరు మండలం దోసకాయలపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ నాగారపమ్మ తల్లి 11వ వార్షిక మహోత్సవం ప్రధాన అర్చకులు సామంతపూడి బ్రహ్మయ్య చార్యులు మరియు విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
దోసకాయలపాడు గ్రామం లో వేంచేసి ఉన్న సామంతపూడి ఇంటిపేరు గల విశ్వబ్రాహ్మణ వంశీయుల కులదైవం శ్రీ నాగారపమ్మ తల్లి 11వ వార్షిక మహోత్సవం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు సామంతపూడి బ్రహ్మయ్య చార్యులు తెలిపారు . అనంతరం శ్రీ నాగారపుమ్మ తల్లి విశిష్టత తెలియజేశారు ఈ సందర్భంగా ఉదయం నుండి గణపతి పూజతో మొదలై ప్రత్యేక పూజలు అలంకరణ హోమం పూర్ణాహుతి అమ్మవారికి హారతులు నిర్వహించి మహా నైవేద్యం సమర్పించారు . అనంతరం సామంతపూడి వారి విశ్వబ్రాహ్మణ వంశీయులు శ్రీ నాగారపుమ్మ తల్లిని దర్శించుకుని తమ తమ మొక్కులను చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు . కార్యక్రమంలో దోసకాయలపాడు గ్రామం మాజీ సర్పంచ్ శివలక్ష్మి వెంకటరామిరెడ్డి లు , గ్రామ పెద్దలు సత్యం సామంతపూడి సుబ్బారావు, సామంతపూడి శివరామ బ్రహ్మచారి, శ్రీనివాసచారి, బాలబ్రహ్మం భద్రయ్య రామారావు సత్యం మరియు సామంతపూడి ఇంటి పేరు గల విశ్వబ్రాహ్మణ వంశీయులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .


