కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 6వ జాతీయ ఉత్తమ నీటి పురుష్కార అవార్డుకు కనిగిరి నియోజక వర్గం పెద చెర్లో పల్లి (పీసీ పల్లి) మండలం మురుగమ్మి పంచాయితీ ఎంపిక అయినట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోషఫ్ కుమార్ తెలిపారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వాటర్ షేడ్ పథకంలో మురుగమ్మి గ్రామ పంచాయితీలో వాటర్ షేడ్ నిథులు, ఇతర డిపార్ట్ మెంటు ల బాగస్వామ్యంలో ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించారు. రిడ్జ్ టు వ్యాలీ విధానంలో వివిధ రకాలైన సహజ వనరుల యాజమాన్య పనులు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టటంతో భూ గర్భ జల మట్టాలు పెంపొందించటంలో ఉత్తమ పద్ధతులు పాటించారు. అందులో బాగంగా 51 పనులు రూ.97 లక్షల విలువైన కందకాలు తత్వకం, వాట్, చిన్న, పెద్ద ఊట కుంటలు, డగౌట్ పాండ్స్. అమృత సరోవర్లు, పూడిక తీత పనులు చేసారు. వీటి ద్వారా ద్వారా 8.21 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేసారు. ఆయా పనులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బృందం సమగ్రంగా తనిఖీ చేసి జాతీయ స్థాయిలో రెండవ ఉత్తమ నీటి పురష్కార అవార్డుకు ఎంపిక చేసారు. ఈ అవార్డును ఈనెల 12న న్యూ డిల్లీలో రాష్ట్ర పతి చేతుల మీదుగా అందించనున్నారు. ఈ అవార్డుకు గాను ఒక ట్రోఫి, ప్రశంశా పత్రం, రూ. 1.5 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. ఈ అవార్డు రావటానికి రాష్ట్ర ప్రభుత్వం . గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల, జిల్లా కలెక్టర్ రాజా బాబు సహకారం మరువలేదని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోషఫ్ కుమార్ అన్నారు.





