జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధ్వర్యంలో డాక్టర్ పి అనంద్ మిని స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి సిలిల్ సర్వీసెస్ టోర్నమెంటు ఎంపికలు నిర్వహించారు. డీఎస్ డీఓ రాజ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఎంపికలు జరిగాయి. అడ్లేటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, క్యారెమ్స్ చెస్ , క్రికెట్, ఫుట్ బాల్, ఖో ఖో, కబడ్డీ, వాలీ బాల్ క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. డీఎస్ పలు క్రీడల కోచేస్ కె పాల్ కుమార్, పి వేణు, లక్ష్మినారాయణ , హేమంత్ కుమార్, కె సుధాకర్, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



