హైదరాబాద్ డిసెంబర్ 20
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హెల్మెట్,సీట్ బెల్ట్ ధరించకుంటే యమపాసంవస్తుంది.ప్రాణాలు తీస్తుంది.అంటూ లోతుకుంట లో వాహన దారులకు యమధర్మరాజు పాత్రధారి అవగాహన కల్పించారు. అనిల్ సర్వే జన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ముఖ్య మైన జంక్షన్ లలో వాహనదారులకు హెల్మెట్ సీటు బెల్ట్ ధరించడం పై అవగాహన కల్పించారు.హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ నేతృత్వంలో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) డి.జోయల్ డేవిస్ ,డి సి పి రాహుల్ హెగ్డే,అడిషనల్ డీసీపీ సి.వేణుగోపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో నార్త్ జోన్ ట్రాఫిక్ 1 ఏ సి పి జి.శంకర్ రాజు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యమ ధర్మ రాజు పాత్ర దారి అర్జున రావు వాహన దారులకు అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరు సీటు బెల్ట్ ధరించాలన్నారు.అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.ఇప్పటి వరకు నగరం లోని 20 జంక్షన్ లలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు.ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడూ ప్రజల తోనే ఉంటుందన్నారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.తమ ప్రాణాలు కాపాడుకోవడం తో పాటు ఎదుటి వారి ప్రాణాలు కాపాడాలని అన్నారు.ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించిన పౌరులకు కృతజ్ఞతగా 5స్టార్ చాక్లెట్లు,రోజా పువ్వులు అందజేసి అభినందించారు.


