కంటోన్మెంట్ డిసెంబర్ 20
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (యంజీ నరేగా) పథకాన్ని రద్దు చేసి వీబీ – జీ – రామ్ – జీ పేరుతో బిల్లును లోక్ సభ లో మందబలం ఉందనే ఉద్దేశంతో బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింంప చేసుకున్న తీరుకు,ఈ పథకంలో గాంధీజీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ టిపిసిసి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఎం జీ రోడ్ లోని గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు .ఈ ధర్నాలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోకలిసిపాల్గొన్నారు
ధర్నా ను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేద ప్రజల నోటికాడముద్దనులాగేయడమే బి జే పి ప్రభుత్వ అంతిమ లక్ష్యం అన్నారు.ఈ బిల్లు కేవలం పేరు మార్పు కోసం చేసింది కాదు బి జే పి ప్రభుత్వం దేవుళ్ళ పేరుతో పథకాలు తీసుకొస్తూ,చేసేవి మాత్రం దెయ్యాల పనులు
బి జే పి ప్రభుత్వం పథకాలలో గాంధీ, నెహ్రూ ల పేర్లు మార్చగలరేమో గానీ, ప్రజల హృదయాల్లో నుంచి వారిని వేరు చేయలేరన్నారు.ఈ కొత్త చట్టం ద్వారా రాష్ట్రాల, స్థానిక సంస్థలహక్కులనుహరించడమే బి జే పి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అన్నారు.గతంలో కేద్రం 90%,రాష్ట్రాలు 10% నిధులు భరిస్తే ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు 40% భరించాల్సి వస్తుంది తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకుని పాత పథకాన్ని, మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుల తో పాటు మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

