తాళ్లూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్త అనారోగ్యంతో మృతి చెందిన రమణయ్య (40) మృత దేహాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి సోమవారం సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో సర్పంచి మేకల చార్లేన్ సర్జన్, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాన్, మాజీ ఎంపీపీ గోళ్ల పాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎలీ వెంకటేశ్వర రెడ్డి, కోట క్రిష్ణా రెడ్డి, సర్పంచిలు మారం ఇంద్రసేనా రెడ్డి, వలి, కోట కోటి రెడ్డి, కోట మన్నే రెడ్డి, యారం రమణా రెడ్డి, యూత్ అధ్యక్షుడు కొర్ర పాటి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

