తాళ్లూరు మండలంలోని పలు ప్రభుత్వ, ప్రభుత్వ పాఠశాలలో
కార్యాలయాలలో 77వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలలో డిప్యూటీ తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎన్ఐఐఐ మల్లిఖార్జున రావు, ఎంఆర్సీ వద్ద ఎంఈఓ జి. సుబ్బయ్య, పీహెచ్సీలో వైద్యాధికారి ప్రవీణ్, వికే జూనియర్ కళాశాల వద్ద ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేణుగోపాల్, హెచ్ఎం మిల్టన్, జెండాను ఎగుర వేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైన్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వరరెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, క్టస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, పార్టీ యూత్ రాష్ట్ర కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, బీసీ సంఘ నాయకుడు పిన్నిక రమేష్ , డిబిసీ వైన్ చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, నాగేశ్వరరావు, డిప్యూటీ ఎంఎపీడీఓ శ్రీనివాస రావు, ఎపీఓ దేవరాజ్, ఎంపీఎం వెంకట రావు, ఎఈ హనుమంతరావు, ఎవో ప్రసాద రావు అన్ని శాఖల అధికారులు మండలంలోని అన్ని పంచాయితీలలో నచివాలయాలలో ఆయా గ్రామాల నర్పంచిల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, ఎంపీడీఓ అజిత, ఎస్పై మల్లిఖార్జున రావులు గణ తంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. తాళ్లూరులో శ్రీ సరస్వతి హైస్కూల్లో విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణా రెడ్డి, ఎబీసీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు, గీతాంజలి, జాహ్నవి. గంగ, ప్రగతి, శారద, అమెరికన్ పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగుర వేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. మిఠాయిలు పంపిణీ చేసారు.




