తాళ్లూరు మండలంలో ఆయా శాఖలలో తమ వృత్తిలో ప్రతిభ చాటిన ఉద్యోగులకు గణ తంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డులను జిల్లా కలెక్టర్ రాజా బాబు ప్రధానం చేసారు. మండల రెవిన్యూ ఇన్స్ఫెక్టర్ ఎంవీ ఎన్ సుధీర్ కుమార్, వెలుగు కంప్యూటర్ ఆపరేటర్ కుమారి, పోలీసి కానిస్టేబుల్ వాను, వేల్పేర్ అసిస్టెంట్ ఉమా మాధవి అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
