లక్కవరం గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఇడమకంటి బ్రహ్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు , దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే ఆధ్వర్యంలో గ్రామ మండల నాయకుల ఏకాభిప్రాయంతో సోమవారం బ్రహ్మారెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు . ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు టి. వి సుబ్బారెడ్డి, జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పూనూరి దేవదానం, కోటేషు , నన్నo వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ మెట్ల రమణయ్య గ్రామ నాయకులు మేడగం వెంకటరామిరెడ్డి, మేడగం వెంకటేశ్వర రెడ్డి , తూము రాఘవరెడ్డి , తూము వెంకట సుబ్బారెడ్డి , పేరం సుబ్బారెడ్డి , గూడా అంజిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.
