బేగంపేట ఫిబ్రవరి 3
(జే ఎస్ డి ఎం న్యూస్) :
పేద బడుగు బలహీన వర్గాలకు అండ కాంగ్రెస్
జెండా అని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కోట నీలిమ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సుధాం ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించిన కాంగ్రెస్ జెండా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బేగంపేట పరిధిలోని పాటిగడ్డ, నూర్ బాగ్, ఎన్ బి టి నగర్ లలో జెండా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ ఇది మన ఐక్యతకు సంకేతం అని, మన ఉద్యమానికి బలం అని, ప్రజల పట్ల మన నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఇంటింటా కాంగ్రెస్ జెండాలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పండగ వాతావరణాన్ని తేవాలన్నారు. నేటి నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ జెండా అభియాన్ కార్యక్రమం డివిజన్లో ఏడో తేదీ వరకు నిర్వహించనున్నట్లు విశాల్ సుధాం తెలియజేశారు .తమ నాయకురాలు కోట నీలిమ
ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

