ట్రాఫిక్ నిబంధనలు పాటించండి….సురక్షితంగా గమ్యాన్ని చేరండి….తిరుమల గిరి డివిజన్ ట్రాఫిక్ ఏ సి పి శంకర్ రాజు.

బోయినపల్లి. ఫిబ్రవరి 12
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రతి ఒక్కరు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.సురక్షితంగా గమ్యాన్ని చేరండి.అని తిరుమల గిరి డివిజన్ ట్రాఫిక్ ఏ సి పి జి.శంకర్ రాజు అన్నారు.జాతీయ రోడ్డు భద్రతా అవగాహన మాసం లో భాగంగా గురువారం బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్-1 డీసీపి కె. రాహుల్ రెడ్డి, ట్రాఫిక్-1 అదనపు డీసీపీ ఎ. లక్ష్మి పర్యవేక్షణలో, రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ మరియు సురక్షితమైన రోడ్డు ప్రవర్తనపై విద్యార్థులలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో ఏ సి పి శంకర్ రాజు మాట్లాడుతూ వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ,సీటు బెల్ట్ ధరించాలన్నారు.రాంగ్ రూట్ ప్రయాణం అత్యంత ప్రమాదకరం అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లి దండ్రులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారి ప్రాణాలతో పాటు ఎదుటి వారి ప్రాణాలకు కూడా ప్రమాదం అన్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సీఈఓ గ్రూప్ కెప్టెన్ ఎ. ప్రవీణ కుమార్, ఎస్‌టిఓ (ఎంటి) వింగ్ కమాండర్ ఎస్. జి. మాగోత్రా, వారెంట్ ఆఫీసర్ సంజీవ్ తివారీ, బేగంపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ జి. జానకి రాములు, హీరో మోటోకార్ప్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేనేజర్ సాదిక్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *