బేగంపేట ఫిబ్రవరి 19
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఛత్రపతి శివాజీ మహరాజ్ అందరికీ ఆదర్శప్రాయుడని, అందరూ ఆయన
అడుగుజాడల్లో నడవాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. గురువారం మొండా మార్కెట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొని అయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ క్రమంలో డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ విద్యాపరంగా, సామాజిక పరంగా అభివృద్ధికి మార్గదర్శకుడిగా శివాజీ మహరాజ్ నిలిచారన్నారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు అని కొనియాడారు.యువతరానికి, తరతరాలకు పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధాం సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
