దేశం కోసం వీరోచిత పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్…..ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట ఫిబ్రవరి 19
(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేశం కోసం వీరోచిత పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్మరించుకున్నారు. ఛత్రపతి శివాజీ  396 వ జయంతి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ఛత్రపతి శివాజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువతకు చిత్రపతి శివాజీ ధైర్య సాహసాలు, దేశభక్తి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*బన్సీలాల్ పేట* డివిజన్…

బన్సీలాల్ పేట డివిజన్ లోని జబ్బార్ కాంప్లెక్స్ తలసాని పాలోవర్స్ ఆధ్వర్యంలో, న్యూ బోయిగూడలోని ఫ్లోరా హోటల్  వద్ద జై భవాని శివాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాలయ్య బస్తీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పద్మారావు నగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, రాజు, కుమార్ యాదవ్, కొత్తూరు వెంకట్, అబ్బాస్, నాగభూషణం, శ్రీనివాస్, నిర్వాహకులు కైలాష్, నితిన్, రితేష్, ఆకాష్, రంజిత్, సాయి, అశోక్, సంతోష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

రాంగోపాల్ పేట డివిజన్….
రాంగోపాల్ పేట డివిజన్ లోని జనరల్ బజార్ లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. శివాజీ. మహరాజ్ విగ్రహానికి ఆయన పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు శివాజీ ప్రతిమను బహుకరించి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, నిర్వాహకులు ఆనంద్ పాటిల్, పబ్బా ప్రకాష్, ప్రకాష్ పాటిల్, చంద్రప్రకాష్, సురేష్ భోస్లే, విశాల్ తదితరులు పాల్గొన్నారు.
సనత్ నగర్ డివిజన్….
సనత్ నగర్ డివిజన్ లోని  జెక్ కాలనీలో శివాజీ నగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. శివాజీకి పూజలు నిర్వహించి న అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఆర్.శివకుమార్, మల్లేష్ యాదవ్, వినయ్ కుమార్, రవి కుమార్, నాయకులు ఖలీల్, బాలరాజ్, రాజేష్ ముదిరాజ్, రమేష్ గౌడ్, అర్జున్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

*అమీర్ పేట* డివిజన్…

ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా అమీర్ పేట లోని తహసీల్దార్ కార్యాలయం నుండి డి. కె రోడ్ లోని మున్సిపల్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ ఊరేగింపు రథంపైకి ఎక్కి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషు కుమారి, నిర్వాహకులు గులాబ్ సింగ్, డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, గౌతమ్, బలరాం, దర్శన్ సింగ్, సత్యనారాయణ, ప్రదీప్ గౌడ్, ఉత్తమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *