తాళ్లూరు మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
తాళ్లూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పలువురు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు చందోలు మల్లికార్జునరావు, రామారావు, శివరామ కృష్ణ, ఊటుకూరి రాధా కృష్ణమూర్తి, పాల్వాది సుబ్బయ్య, ఆర్యవైశ్య మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
