సికింద్రాబాద్ మార్చి 27
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సీతాఫల్ మండి పరిధిలోని రవీంద్రనగర్ లో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం లో సికింద్రాబాద్ టి డి పి ఇన్చార్జి వల్లారపు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. డాక్టర్ రాజారామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణం కన్నుల పండుగా జరిగింది. ఈసందర్భంగా వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సంతోషాలు, విజయాలు నింపాలని మనసారా ఆ శ్రీరాముల వారిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలు చేసే ప్రతి పని విజయవంతం కావాలని, వారి కుటుంబాల్లో
సుఖశాంతులు చిరకాలం నిలవాలన్నారు. రాములవారి ఆశీస్సులతో ప్రజలకు మరింత ఆనందం, ఉత్సాహం కలగాలని వేడుకున్నట్లు వల్లారపు శ్రీనివాస్ తెలిపారు.
ఈకార్యక్రమంలో తెదేపా సీతాఫలమండి డివిజన్ అధ్యక్షుడు జి వి కృష్ణ, సీనియర్ నాయకులు పరిటాల విజయ్ కుమార్, వెంకటస్వామి, నాయుడు తదితరులు పాల్గొన్నారు
