ఒంగోలు లో పట్టణంలో పలుచోట్ల జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఒంగోలు కర్నూల్ రోడ్డులో షిరిడి సాయిబాబా మందిరంలో,ఒంగోలు నిర్మల్ నగర్ లో, జడ్పీ కాలనీలో, గద్దలగుంటలో , గద్దలగుంట నెహ్రూ బొమ్మ వద్ద, కొణిజేడు బస్టాండ్ లో, సాయిబాబా మందిరంలో, ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నిర్వాహక భక్త కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన
శ్రీసీతారామచంద్రస్వామి వారి వసంత నవరాత్రోత్సవ కళ్యాణ మహోత్సవంలోఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
ఆయన వెంట పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య ,తాతా ప్రసాద్ ,సరస్వతి విద్యాసంస్థలు చైర్మన్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు.



