అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోష్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఐసీడీఎస్ దర్శి ప్రాజెక్టు పరిధిలోని తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి, కురిచేడు, దొనకొండ మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల పోష్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ పరిమళ తెలిపారు. అంగన్ వాడీ కార్యకర్త, ఆయా ఆ గ్రామ కోడలు అయి ఉండాలని , కార్యకర్త పదవ తరగతి, ఆయా ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. అంగన్ వాడీ కార్యకర్తకు రూ. 11,500, ఆయా కు రూ.7వేలు గౌరవ వేతనం ఇవ్వబడునని చెప్పారు. భర్తీ చేయు సమయంలో ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, వితంతువు, ఈసీఈ వర్క్ అనుభవం ఉన్న వారికి 5 మార్కులు అనాధ అయి ఉండి క్రషీ మరియు ప్రభుత్వ వనతి గృహములో పదవ తరగతి మరియు వయో పరిమితి కలిగి ఉన్న వారికి పది మార్కులు కేటాయించబడునని చెప్పారు. దరఖాస్తులు ఆగష్టు ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించబడునని చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో 12 అంగన్ వాడీ కార్యకర్తలు పోస్టులు, 16 ఆయా పోష్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అందులో కార్యకర్తలవి కురిచేడు మండలంలో ఎన్ ఎన్పీ కాలనీ (జనరల్), రామాంజనేయులు కాలనీ (ఎస్టీ), దొనకొండ మండలంలో శిద్ధాయ పాలెం (బీసీ-ఏ), తెల్లపాడు (జనరల్) దొనకొండ మండలంలో, దొనకొండ (జనరల్), ముండ్లమూరు మండలంలో, ముండ్లమూరు -2 (ఎస్సీ), భీమ వరం-2 (జనరల్), పెద్ద రావి పాడు (జనరల్), దర్శి మండలంలో దేవ వరం (జనరల్), అగ్ని పురి కాలనీ (జనరల్), తాళ్లూరు మండలంలో, తూర్పుగంగవరం -2 (జనరల్), లక్కవరం -1 (జనరల్) ఉ న్నాయి. అదే విధంగా అంగన్ వాడీ ఆయాలు వివరాలు దొనకొండ మండలంలో .. మల్లం పేట -1( ఎస్సీ), లక్ష్మి పురం –1 (జనరల్), నారపురెడ్డి పల్లి (జనరల్), పోలేపల్లి -1 (జనరల్), పుచ్చకాయల పల్లి (జనరల్), కురిచేడు మండలంలో గొల్ల పాలెం (బీసీ-డి), దర్శి మండలంలో రాజంపల్లి -2(జనరల్), అయ్యప్ప టెంపుల్ (బిసీ-ఈ), కొత్త పల్లి – 1 (జనరల్), దర్శి తూర్పు వీరాయ పాలెం -2 (జనరల్), ముండ్లమూరు మండలంలో .. నాయుడు పాలెం –2 ( జనరల్), తాళ్లూరు మండలంలో కొర్రపాటి వారి పాలెం -2 (ఎస్సీ), శివరామపురం -1 (జనరల్), సోమవరప్పాడు ( ఎస్సీ), తాళ్లూరు – ఎస్సీ (ఎస్సీ), ఎకలవ్య నగర్ (ఎస్టీ) లకు కేటాయించారు. అయా కేంద్రాలను కేటాయించిన తరగతులకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అటువంటి మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయని చెప్పారు. ఆగస్టు ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులను కార్యాలయంలో అందజేయాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *