ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల ప్రకారం దర్శి డిఎస్పి బాలమురళి స్వీయ పర్యవేక్షణలో ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలలో రైతులు పంట పొలాల్లో బోర్లు కు అమర్చిన ఎలక్ట్రిక్ వైర్లను దొంగలిస్తూ మరియు గంజాయి వ్యాపారం చేస్తున్న పలువురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 21 ½ కేజీల రాగి ముద్దలను మరియు రెండు కిలోల గంజాయి ని స్వాధీనం పరుచుకున్న బల్లికురవ పోలీసులు.
అరెస్టు కాబడిన ముద్దాయిలు :
1)పొట్లూరి శ్రీనివాసరావు @శ్రీను, తండ్రి పేరు ఏడుకొండలు, వయసు 26 సం’’లు, అంబేద్కర్ కాలనీ వెనుక సంఘం, పొన్నూరు టౌన్, గుంటూరు జిల్లా,
2)పొన్నూరు వెంకటేష్, తండ్రి పేరు అంకమ్మరావు, వయసు 22 సం’’లు, నాగిరెడ్డిపాలెం
గ్రామం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా,
3)రావూరి దుర్గాప్రసాద్, తండ్రి పేరు సుబ్బారావు, వయసు 20 సం’’లు, నాగిరెడ్డిపాలెం
గ్రామం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా,
4) రావూరి సుబ్బారావు, తండ్రి పేరు వీరయ్య, వయసు 40 సం’’లు, నాగిరెడ్డిపాలెం గ్రామం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా
5)కొమరగిరి చల్లయ్య తండ్రి లక్ష్మయ్య, వయసు, 50 సం, సుబ్బారావు కాలనీ, జాండ్రపేట, చీరాల మండలం
అరెస్టు చేయబడిన ప్రదేశము వివరాలు: బల్లికురవ మండలం లోని గంగమ్మ గుడి ఆర్చి వద్ద ఈరోజు అనగా 22. 07. 2026న ముద్దాయిలను బల్లికురవ ఎస్సై వై నాగరాజు మరియు వారి సిబ్బంది బల్లికురవ శివారులో అదుపులోకి తీసుకొనగా వారిని సంతమాగులూరు సి.ఐ పి. శేషగిరిరావు గారు అరెస్టు చేసినారు.
స్వాధీన పరుచుకున్న సొత్తు వివరాలు : 21 ½ కేజీల రాగి ముద్దలను మరియు రెండు కేజీల గంజాయిను స్వాధీనపరుచుకున్నారు.
ముద్దాయిలు నేపథ్యము మరియు నేరం చేసిన తీరు:
పై తెలిపిన ముద్దాయిలందరూ ఒకరికి ఒకరు బంధువులు కావడం వల్ల గత కొంతకాలం గా గ్రూపుగా ఏర్పడి చెడు వ్యసనాలకు లోనై సులువు మైన మార్గాల్లో డబ్బు సంపాదించే ఉద్దేశంతో ప్రకాశం జిల్లాలో బల్లికురవ, సంతమాగులూరు మరియు కొరిశపాడు మండలాల్లో రాత్రి సమయంలో పంట పొలాల్లో తిరుగుతూ పంట పొలాల్లో రైతులు బోర్లు కు అమర్చిన ఎలక్ట్రికల్ వైర్లను కత్తిరించి వాటిని కాల్చి అందులో గల రాగి తీగను దొంగలించి దానిని అమ్ముకుంటూ తిరుగుతున్నారు, దానిలో వచ్చిన డబ్బులు సరిపోక ఈ మధ్యకాలంలో బల్లికురవ మరియు సంతమాగులూరు మండలాల్లో గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కూలీలకు గంజాయి అమ్మడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయని గ్రహించి ఒరిస్సాకు చెందిన రాజమోహన్ మాలిక్ వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి బల్లికురవ మండలంలో గ్రానైట్ కార్మికులకు విక్రయిస్తున్నారు.
అభినందన: బల్లికురవ, సంతమాగులూరు మరియు కొరిశపాడు మండలాల్లో రైతుల ఏర్పాటు చేసుకున్న బోర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి వైరు ను దొంగతనం చేసి వారికి అపారమైన నష్టం కలిగిస్తున్న దొంగల ముఠాను చాకచక్యంగా గుర్తించి వారిని అరెస్టు చేసిన సంతమాగులూరు సర్కిల్ సి.ఐ పి శేషగిరిరావు, బల్లికురవ ఎస్సై వై. నాగరాజు మరియు వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
