2025 వ సంవత్సరం గాను 2023, 24, 25 సంవత్సరాలలో
లలో భూమి, సముద్రం, గాలిపై తాము చేసిన సాహస కార్యకలాపాలకు అత్యత్తమ విజయాలు సాధించిన వారికి భారత యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ టెన్జింగ్ నార్గ్ నేషనల్ అవార్డు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్టెఫ్ సీఈఓ అర్జున్ నాయక్ తెలిపారు. ఆగస్టు 20 లోపు దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకుని స్టెప్ సీఈఓ కార్యాలయంలో అందించాలని చెప్పారు. విజేతలకు ప్రశంశా పత్రంతో పాటు రూ. 15 లక్షలు నగదు అందించనున్నారు. ఆగష్టు 29న రాష్ట్ర పతి చేతుల మీదుగా ఈ అవార్డు అందిస్తారు. పూర్తి వివరాలకు 77804338282 సంప్రదించాలి.
నేషనల్ అడ్వంచరీ అవార్డుకు దరఖాస్తులు
24
Jul