టీడీపీ బొద్దికూరపాడు గ్రామ అధ్యక్షుడు పోలంరెడ్డి సుబ్బారెడ్డి అకాల మరణం పార్టీకి తీరనిలోటని ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం జరిగిన పి.సుబ్బారెడ్డి సంస్మరణ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుబ్బారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని డాక్టర్ లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు తెలిపారు. నివాళులర్పించినవారిలో టీడీపీ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బి ఓబుల్ రెడ్డి , సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య ,పిన్నిక రమేష్, క్లస్టర్ ఇంచార్జ్ రాచకొండ వెంకట్రావు, రాష్ట్ర మాజీ యూత్ కార్యదర్శి గొల్ల పూడి వేణుబాబు,తాళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకారెడ్డి, గ్రామ నాయకులు సూరా రెడ్డి, రమణరెడ్డి, కోటిరెడ్డి, అంకిరెడ్డి ఉన్నారు.

