తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసిన నాయకులు, దర్శి నియోజకవర్గ రైతులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాళ్లూరు మండలంలోని పలు రాజకీయ, పార్టీ వ్యవహారాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ కొర్రపాటి శరత్ బాబు, మండల వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, మాజీ సర్పంచ్ కోట బుచ్చన్న చౌదరి, గ్రామ పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి యర్రయ్య, గొల్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



